ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. లా ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు పక్రియ మొదలైన నేపథ్యంలో నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో 6 ఉద్యోగ ఖాళీలు జనరల్ కేటగిరీ ఉద్యోగ ఖాళీలు కాగా ఆర్థికంగా వెనుకబడిన విభాగంకు సంబంధించి ఒక ఉద్యోగం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి 3 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
బ్యాచిలర్ ఆఫ్ లాస్ లేదా బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లాస్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్.ఎల్.బీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలు కాగా వికలాంగ అభ్యర్థులకు వయోపరిమితి విషయంలో సడలింపులు ఉంటాయి.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుండగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. నెలకు లక్ష రూపాయల వేతనంతో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.