నిరుద్యోగులకు ఐబీపీఎస్ శుభవార్త.. ఆ బ్యాంకుల్లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్2, స్కేల్3 ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది.

2023 సంవత్సరం జూన్ నెల 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ibps.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

8000 కంటే ఎక్కువ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అవుతాయని తెలుస్తోంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండగా ఇతర అభ్యర్థులకు 175 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా తెలుగులో కూడా ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.

ఐబీపీఎస్ పేజ్ లో అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేసి చివరిగా ఫారమ్ ను సమర్పించి ప్రింట్ అవుట్ తీసుకోవాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.