నెల్లూరు సెంట్రల్ జైలులో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.18,500 వేతనంతో?

ఏపీలోని నెల్లూరు సెంట్రల్ జైలులో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వైర్ మెన్, బార్బర్ తో పాటు టైలరింగ్ ఇన్ స్ట్రక్టర్ గ్రేడ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 3 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

టైలరింగ్ ఇన్ స్ట్రక్టర్ గ్రేడ్ 2 ఉద్యోగ ఖాళీ 1 ఉండగా వైర్ మ్యాన్ జాబ్ 1, బార్బర్ జాబ్ 1 ఉన్నాయి. ఏడో తరగతి,పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 15000 రూపాయల నుంచి 18500 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 2024 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అకాడమిక్స్ లో సాధించిన మార్కులతో పాటు అనుభవం, స్కిల్ టెస్ట్ ద్వారా సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

https://spsnellore.ap.gov.in/prisons-department/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. cp-nellore@ap.gov.in ఈమెయిల్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సూపరిన్డెంట్ ఆఫ్ జైల్స్ నెల్లూరు అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.