ఇండియన్ రైల్వేస్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. సౌత్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎవరైతే ఉద్యోగ ఖాళీలలో చేరుతారో వాళ్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటారు. రైల్వేలో పని చేయాలని భావించే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హుబ్బళ్లిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే ఈ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.
rrchubli.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పది, ఇంటర్ పరీక్షలలో కనీసం 50 శాతం మార్కులు 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే బెనిఫిట్ కలుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఐటీఐ పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వేర్వేరు డివిజన్లలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉండటంతో నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
swractapp2223@gmail.com మెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. rrchubli.in వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది . వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.