త్రివిధ దళాల్లో చేరాలనేది చాలా మంది యువత కోరిక. అయితే ఆ ఉద్యోగాల నియామకం గురించి ఇప్పటికే చాలా మందికి పూర్తిగా తెలియదు. ఎలా అప్లై చేయాలి, ఎలా చదువుకోవాలి, జీతం ఎంత ఉంటుందని వివరాలు తెలియదు. ఇంటర్ మీదనే నేవీలో ఉద్యోగాల కల్పన ఉంటుందని అవగాహన లేదు. తాజాగా అగ్నివీర్ స్కీం కింద నేవీ ఉద్యోగాలు విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగంలోకి చేరాలనుకునే యువతకు మంచి అవకాసం కల్పిస్తోంది నేవీ. ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగ కల్పన చేపట్టింది. అగ్నివీర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఇండియన్ నేవీ మే 29 నుంచి ప్రారంభించింది. దానికి ఇవాళే చివరి రోజు. అభ్యర్థులు తమ అర్హతను చెక్ చేసుకుని అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అగ్నివీర్ స్కీం కింద విడుదల చేసిన నోటిఫికేషన్ లో మొత్తం 4165 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందుకు సంబంధించి
విద్యా అర్హతలు..మ్యాథ్స్, ఫిజిక్స్‌తో 10+2 పరీక్షలో అర్హత సాధించాలి. వీటితో పాటు కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ మూడింటిలో ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. అంతే కాకుండా ముఖ్యమైన నిబంధన ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగం పొందాలంటే పెళ్ళై ఉండకూడదు.
అగ్నివీర్ స్కీం కింద చేరిన వారికి ఆకర్షనీయమైన జీతం ఉంటుంది. మొదటి ఏడాది జీతం నెలకు రూ.30,000 ఇస్తారు. అందులో రూ.21,000 చేతికి అందుతుంది. రూ.9,000 అంటే జీతంలో 30 శాతం శాలరీ కార్పస్ ఫండ్‌లో జమ అవుతుంది. జీతం సంవత్సరాలు గడిచేకొద్దీ క్రమంగా పెరుగుతుంది.
ఈ ఉద్యోగానికి ఎంపికైన తర్వతా పలు రకాల హోదాల్లో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తారు. ఇండియన్ నేవీలో చెఫ్‌గా చేరితే, అభ్యర్థులు శాకాహారం, మాంసాహారం సహా మెను ప్రకారం భోజనం సిద్ధం చేయాల్సి ఉంటుంది. రేషన్ మేనేజ్‌మెంట్‌లో కూడా భాగం కావాలి. ఇతర కేటాయించిన విధులతో పాటు తుపాకీ శిక్షణ పొందుతారు.