నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. indiaseeds.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 89 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగ ఖాళీలలో ట్రైనీ (వ్యవసాయం) ఉద్యోగ ఖాళీలు 40 ఉండగా జూనియర్ ఆఫీసర్ విజిలెన్స్ ఉద్యోగ ఖాళీలు 15, ట్రైనీ (స్టెనోగ్రాఫర్) ఉద్యోగ ఖాళీలు 5, ట్రైనీ (మార్కెటింగ్) ఉద్యోగ ఖాళీలు 6, ట్రైనీ (అగ్రికల్చర్ స్టోర్) ఉద్యోగ ఖాళీలు 12 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజనీరింగ్) 01, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) 01, మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) 01, జూనియర్ ఆఫీసర్ (విజిలెన్స్) 2, ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్) ఉద్యోగ ఖాళీలు 3, జూనియర్ ఆఫీసర్ (లీగల్) ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి.
పది, ఇంటర్, ఐటీఐ, బీఈ, బీటెక్, డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు అర్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. 2023 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
దరఖాస్తు ఫారమ్ ప్రింట్ అవుట్ ను తీసుకుని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకుంటే మంచిది. ఉద్యోగ ఖాళీలను బట్టి వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.