ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 132 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా జులై 26వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైందని సమాచారం. ఆగష్టు నెల 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగష్టునెల 16వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 30,000 రూపాయల వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేర్వేరు ఆలవెన్స్ లు కూడా లభిస్తాయి. https://www.ippbonline.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం.
ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఆపరేషన్స్‌లో అనుభవం ఉండటంతో పాటు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనుభవం ఉన్నవాళ్లకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని భోగట్టా. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.