యంత్ర ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఈ సంస్థ 5395 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరో రెండు రోజుల్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మార్చి 28వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో 3508 ఉద్యోగ ఖాళీలు ఐటీఐకు సంబంధించినవి కాగా 1887 నాన్ ఐటీఐకి సంబంధించినవి. బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ ఉద్యోగాలతో పాటు కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, ఇతర ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
కనీసం 50 శాతం మార్కులు సాధించి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు ఇందుకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా అర్హతల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ఫీజు ఓబీసీ, ఓసీ అభ్యర్థులకు 200 రూపాయలు కాగా మిగిలిన వాళ్లకు మాత్రం 100 రూపాయలుగా ఉంది.
ఆన్ లైన్ ద్వారా ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో బెనిఫిట్ కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.