కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. గ్రాడ్యుయేషన్, డిప్లొమా అభ్యర్థులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీపికబురు చెప్పడం గమనార్హం. ఈ సంస్థ తాజాగా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. mha.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశంతో పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం.
భారీ వేతనంతో 797 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు సంతోషిస్తున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో 325 ఉద్యోగ ఖాళీలు జనరల్ అభ్యర్థుల కోసం ఉండగా, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 79 ఉద్యోగ ఖాళీలు, ఓబీసీ అభ్యర్థులకు 215 ఉద్యోగ ఖాళీలు, ఎస్సీ అభ్యర్థులకు 119 ఉద్యోగ ఖాళీలు, ఎస్టీ అభ్యర్థులకు 59 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలను కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈసీఈ, ఐటీ, సీ.ఎస్.ఈ బ్రాంచ్ లలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పవచ్చు.
జనరల్, ఓబీసీ, ఈడ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు 450 రూపాయలకు ఉందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 81,000 రూపాయల వేతనం లభించే అవకాశం అయితే ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరగనుంది.