బిజినెస్ చేయాలని భావించే వాళ్లకు శుభవార్త.. కేంద్రం నుంచి రూ.10 లక్షలు పొందే ఛాన్స్!

దేశంలో ప్రస్తుతం చాలామంది ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం మంచిదని భావిస్తున్నారు. వ్యాపారం చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని ఫీలవుతున్నారు. అయితే వ్యాపారం చేయాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మంచి పథకాలను అమలు చేస్తోంది.

కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం పొందవచ్చు. బ్యాంకుల ద్వారా సులువుగా ఈ రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2015 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. నిరుద్యోగులకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

జన్ సమర్థ్ పోర్టల్‌ సహాయంతో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రాజెక్ట్ ధర ఆధారంగా రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. లోన్ అప్రూవ్ అయిన తర్వాత ఆ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.

సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అవసరాలకు అనుగుణంగా లోన్ పొందే అవకాశం ఉన్నా అర్హతలు ఉన్నవాళ్లు మాత్రమే ఈ రుణాన్ని పొందవచ్చు.