నెలకు రూ.500 పొదుపుతో ఏకంగా రూ.15 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?

మనలో చాలామంది డబ్బులను పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే నెలకు రూ.500 పొదుపుతో ఏకంగా రూ.15 లక్షలు పొందే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ మొత్తం పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని భావించే వాళ్లకు ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు 500 రూపాయల చొప్పున దీర్ఘకాలంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు సొంతమవుతాయి. వార్షిక స్టెప్ అప్ ప్లాన్ సెట్ చేసుకుంటే ఏడాదికి 10 శాతం పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాలి. ఈ విధంగా 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 16 శాతం రిటర్న్స్ ఉన్నా రూ. 15.66 లక్షలు పొందే అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయి.

కేవలం 3.34 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టడం ద్వారా 12.22 లక్షల రూపాయల రాబడి పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘ కాలంలో సగటున 12 శాతం రాబడి అందించే అవకాశాలు అయితే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఒకింత రిస్క్ తో కూడుకున్నది. మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏ మాత్రం అవగాహన లేకపోతే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.