ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ లెక్చరర్, చీఫ్ ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2024 సంవత్సరం మార్చి నెల 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://intranet.itdc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 6 ఉండగా చీఫ్ ఉద్యోగ ఖాళీలు 3, అసిస్టెంట్ మేనేజర్ (ఈవెంట్స్) ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) 1, అసిస్టెంట్ లెక్చరర్ 4, అసిస్టెంట్ మేనేజర్ (e&m) ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి ఏడాదికి 6 లక్షల రూపాయల వేతనం లభించనుండగా లెక్చరర్ ఉద్యోగానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.
అసిస్టెంట్ మేనేజర్,అసిస్టెంట్ లెక్చరర్ ఉద్యోగ ఖాళీలకు 30 సంవత్సరాలు వయో పరిమితిగా ఉంది. అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) ఉద్యోగానికి 32 సంవత్సరాలు వయో పరిమితిగా ఉంది. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ/మూడేళ్ల డిప్లొమాతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఉద్యోగాల కోసం సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేయాలి.
అసిస్టెంట్ మేనేజర్ లీగల్ ఉద్యోగ ఖాళీల కోసం కనీసం 55 శాతం మార్కులతో లా పూర్తి చేసి ఉండాలి. అసిస్టెంట్ లెక్చరర్ ఉద్యోగాలకు మాత్రం నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది.