మహిళా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇదే.. రూ. 81,100 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు!

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్) ఉద్యోగ ఖాళీలతో పాటు గ్రూప్ ‘సి’ (నాన్ గెజిటెడ్ & నాన్ మినిస్టీరియల్) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. recruitment.itbpolice.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జులై 8 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు లెవెల్ 4 పే వర్తిస్తుంది. కనిష్టంగా 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు వేతనం లభించనుంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

సహాయక నర్సింగ్ మిడ్‌వైఫరీ సర్టిఫికేట్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్ 1 – ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ తో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫేజ్2 ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎలాంటి పరీక్ష రుసుము లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 81 హెడ్ కానిస్టేబుల్ (మిడ్ వైఫ్) ఉద్యోగ ఖాళీల కోసం అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు వయస్సుకు సంబంధించి మినహాయింపులు ఉంటాయి. నోటిఫికేషన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.