భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే వారి మధ్య శారీరక సంబంధం కూడా ఎంతో కీలకమైనదని చెప్పాలి.ఇలా చాలామంది వైవాహిక జీవితంలో శృంగారాన్ని ఇష్టపడుతూ ప్రతిరోజు తమ జీవిత బాగ స్వామితో కలయికలో పాల్గొనాలని భావిస్తారు. మరి కొంతమందికి పెద్దగా ఇలాంటి వాటిపై ఆసక్తి చూపించరు. అయితే ప్రతిరోజు కలయిక వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు కలయిక వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఎలాంటి సమయంలో కలయికకు దూరంగా ఉండాలి… ఈ విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే..
సాధారణంగా భార్యాభర్తలిద్దరూ కూడా ఏదో ఒక విషయం పట్ల గొడవలు పడడం సర్వసాధారణం అయితే ఇలా గొడవలు అలకపోగొట్టడం కోసం కొందరు కలయికలో పాల్గొంటూ ఉంటారు. ఇలా కోపం పోగొట్టడానికి పొరపాటున కూడా శృంగారంలో పాల్గొనదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు సర్దుమనగవు. అలాగే చాలామంది మద్యం మత్తులో శృంగారంలో పాల్గొంటారు. ఇది కూడా శృంగారంలో పాల్గొనడానికి సరైన సమయం కాదు.
ఫుల్లుగా మద్యం సేవించిన వారు వారి శరీరంపై నియంత్రణ ఉండదు కనుక ఇలాంటి సమయంలో శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.ఇకపోతే మీరు పాప్ పరీక్షకు వెళ్లాలనుకునే సమయంలో 48 గంటల ముందు నుంచి శృంగారంలో పాల్గొనక పోవడం ఎంతో మంచిది.ఇక ఎవరైతే ఇప్పుడప్పుడే పిల్లలను వద్దనుకుంటున్నారో అలాంటివారు కండోమ్స్ లేకుండా సెక్స్ లో పాల్గొనడం మంచిది కాదని నిపుణులకు తెలియజేస్తున్నారు.