విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్-ఎ, డ్రాట్స్‌మన్-బి, రేడియోగ్రాఫర్-ఎ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మే 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది.
vssc.gov.in , isro.gov.in వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 49 ఉద్యోగ ఖాళీలలో టెక్నీషియన్ ఏ ఉద్యోగ ఖాళీలు 43 ఉండగా డ్రాఫ్ట్స్‌మన్-బి ఉద్యోగ ఖాళీలు 5, రేడియోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి. మొత్తం 49 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో వేగంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఉద్యోగ ఖాళీని బట్టి స్వల్పంగా వేతనంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కనిష్టంగా 21700 రూపాయల నుంచి గరిష్టంగా 81100 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం ఉంటుంది.
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.