వాస్తు ప్రకారం మంచం ఆ దిశలో ఉంటే మంచిదా.. అలా చేస్తే ధనం వస్తుందా?

మనలో వాస్తును నమ్మేవాళ్లు ఎక్కువమంది ఉంటారు. వాస్తు నియమాలను ప్రతిరోజూ పాటించడం వల్ల అనుకూల ఫలితాలు కలగడంతో పాటు దేవుని అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో నిద్రించని పక్షంలో నిద్ర సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చక్కని నిద్ర, కడుపు నిండా తిండి ఉండాలంటే వాస్తు విషయంలో తప్పులు చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్ లో మంచం ఉత్తరం వైపున ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తూర్పు వైపున కాళ్లు పెట్టుకుని పడుకునే విధంగా మంచం ఉండాలి. పడమర వైపు కాళ్ళు, తూర్పు ముఖంగా తల పెళ్లి పడుకుంటే మాత్రం నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్లు శుభ్రంగా కడిగి నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు

భోజనం చేసే ముందు కూడా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలని పూర్వీకుల నుంచి చెబుతున్నారు. చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా సుఖ నిద్ర కలిగే అవకాశంతో పాటు ప్రశాంతత చేకూరుతుంది. పడక గదిలో అద్దాలను పెట్టుకోవడం మంచిది కాదని అద్దం ఎంత పెద్దదైతే దాంపత్య బంధంలో అంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందని పండితులు వెల్లడిస్తున్నారు.

బెడ్ రూమ్ లో ఇండోర్ మొక్కలు, తెల్లటి పువ్వులు పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. బెడ్ రూమ్ లో జంట పక్షులను ఏర్పాటు చేసుకుంటే కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో మంచం ఉండాలని భావించే వాళ్లు ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.