రోజురోజుకీ వివాహేతర సంబంధాలు పెరిగిపోవడానికి ఇదే కారణమా.. సర్వేలో వెళ్లడైనా షాకింగ్ విషయాలు!

ప్రస్తుత కాలంలో భార్య భర్తలు అన్యోన్యంగా పది కాలాలపాటు సంతోషంగా జీవించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పాలి. చదువుకోని వారి నుంచి మొదలుకొని చదువుకున్నటువంటి వారు కూడా ఇతరులతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడం ప్రతిరోజు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా భార్యాభర్తలు ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల రోజు రోజుకి ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. ఎంతో మంది చిన్నారులు అనాధలుగా మిగులుతున్నారు. మరికొందరు జీవితకాలం పాటు జైలలో ఖైదీలుగా మగ్గిపోతున్నారు.

ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాల్సిన దంపతులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని చిన్నారులను అనాధలుగా మార్చడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి పలు సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలో పలు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.సాధారణంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…

*సంపాదన ముఖ్యమని భావించి సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం ఒక కారణం.

*చిన్న చిన్న గొడవలను పెద్దదిగా చేసుకుని భార్యాభర్తలు గొడవ పడటం ఈ భార్యాభర్తల గొడవలోకి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం ప్రధాన కారణం.

*బయట వ్యక్తులతో చాలా సన్నిహితంగా మాట్లాడినట్టు తన లైఫ్ పార్టనర్ తో మాట్లాడలేకపోవడం అలాగే ఎక్కువగా సెల్ఫోన్లకు బానిసయ్యి సోషల్ మీడియా యాప్ ద్వారా స్నేహాలు పెంచుకొని ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కూడా కారణం అవుతున్నాయి.

*బలహీనత మనస్తత్వం కలిగిన వారు అలాగే చెడు వ్యసనాలు కలిగిన వారు కూడా చాలా తొందరగా ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నట్లు ఈ సర్వేలో వెళ్లడైంది.