ప్రస్తుత జీవనశైలి విధానంలో మార్పుల వల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. అందులో ప్రధాన సమస్యలలో ఒకటి కిడ్నీ సమస్య. యుక్త వయసులోనే కిడ్నీలో రాళ్లు వచ్చి బాధపడడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం.
శరీరంలో మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యాక వ్యర్థ పదార్థాలు అన్ని ఫిల్టర్ కోసం కిడ్నీ వద్దకు చేరుకుంటాయి. ఆ వ్యర్థాలలో ఉన్న క్యాల్షియం ఎక్కువగా పేరుకుపోయినప్పుడు అవి క్రిస్టియన్స్ గా మారటాన్ని మనం కిడ్నీ స్టోన్స్ అంటాము. శరీరంలో కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి ముఖ్య కారణం నీరు తగినంత తాగకపోవడమే. నీటి ద్వారానే కిడ్నీ ఫిల్టర్ బాగా చేస్తుంది.
శరీరంలో నీటి నిల్వలు తగ్గినప్పుడు కాల్షియం పేరుకుపోయి క్రిస్టల్ గా మారుతుంది. రెండవది ఉప్పు అనేది తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువ తీసుకుంటే అది ఎముకలలో ఉన్న కాల్షియన్ని బయటకు వచ్చేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలో క్యాల్షియం నిల్వలు పేరుకు పోతాయి. కాల్షియం బయటికి రావాలంటే రోజుకు ఐదు లేదా ఆరు లీటర్ల నీటిని త్రాగాలి. ఇక్కడే ఒక చిన్న టెక్నిక్ ఉంది.
ఆహారంతో పాటు ఎక్కువ నీరు తాగి మనం ఐదు లీటర్లు తాగాము అంటే సరిపోదు. ఈ విధంగా ఫలితం ఉండదు. ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా పళ్ళు తోముకుని ఒక లీటర్ కు పైగానే ఖాళీ కడుపుతో త్రాగితే కొద్దిసేపటికి అది యూరిన్ గా మారి వేగంగా బయటికి వస్తుంది. ఆ వేగానికి వ్యక్తపదార్థాలు బయటికి పోవడమే కాక, ఏమైనా స్టోన్స్ ఉంటే అవి కరిగి బయటకు వచ్చేస్తాయి.
మరలా రెండు గంటల తర్వాత ఒక లీటర్ నీటిని తాగితే మలవిసర్జన,మూత్రం ద్వారా వ్యర్థాలు బయటకు పోతాయి. ఆహారం తీసుకునేటప్పుడు అవసరం ఉంటే కాస్త నీటినే తాగాలి. తరువాత అరగంట దాటినాక లీటర్ నీటిని తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. నీటి ద్వారానే కిడ్నీకి ఏ సమస్యలు ఉండవు.