భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోవడానికి ప్రధాన కారణం అదేనా.. సర్వేలు ఏం చెబుతున్నాయి?

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని విడిపోయే వారి సంఖ్య అధికమవుతుంది. సాదరణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నప్పటికీ కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. వైవాహిక జీవితంలో పదికాలాలపాటు ఎంత సంతోషంగా గడపాల్సిన కొన్ని జంటలు తమ బంధానికి బీటలు భారెలా ప్రవర్తిస్తున్నారు.అయితే ఇలా భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు విడిపోతున్నారనే విషయం గురించి ఓ సర్వే నిర్వహించారు.

ఈ సర్వేలో భాగంగా 72 శాతం మంది మహిళలే తమ భర్తలతో విడిపోవడానికి ఆసక్తి చూపిస్తూ విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా మహిళలు విడాకులు తీసుకోవడానికి గల కారణాలను కూడా ఈ సర్వే ద్వారా వెల్లడించారు. 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన వారిలో ఈ సర్వే నిర్వహించి పలు విషయాలను తెలియచేశారు. ముఖ్యంగా మహిళలు తమ భర్తల దగ్గర లైంగికంగా తృప్తి పొందలేకపోవటం వల్లే విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తుంది.

ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుగుల జీవితంతో పాటు పరుగులు పెడుతూ రోజు అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే తమ భాగస్వామ్య గురించి ఆలోచించే తీరిక లేనందున మహిళలు ఈ విషయంలో తరచూ గొడవలు పడుతూ ఇద్దరు విడిపోవడానికి సిద్ధమవుతున్నారని ఈ సర్వే వెల్లడించింది.అదేవిధంగా తమ జీవిత భాగస్వామి తమతో ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల మహిళలు ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి విడాకుల వరకు వెళ్తున్నారని ఈ సర్వే ద్వారా వెల్లడించారు.