మనలో చాలామంది ఉప్పు విషయంలో కొన్ని నిర్ణయాలను కలిగి ఉంటారు. ఉప్పును దానం చేయడం వల్ల చెడు జరుగుతుందని చాలామంది భావిస్తారు. పురాణాల ప్రకారం ఉప్పును దానంగా ఇస్తే మంచి జరుగుతుంది. అయితే ఉప్పును అప్పుగా మాత్రం ఇవ్వకూడదు. రాతిఉప్పును లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి జన్మించిన సముద్రం నుంచి రాతిఉప్పు పుట్టింది. ఉప్పును అప్పుగా ఇస్తే ఇతరులకు మన దగ్గర ఉన్న లక్ష్మీదేవిని ఇచ్చినట్టు అవుతుంది.
ఉప్పును దొంగలించడం వల్ల కూడా చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అందువల్ల ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగతనం చెయ్యకూడదు. తక్కువ ధరకే లభించే వంట ఉత్పత్తులలో ఉప్పు ఒకటి కాగా రాత్రి సమయంలో ఉప్పును ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా మంచిది కాదు. ఉప్పు ఇతరులకు ఇస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని పెద్దలు చెబుతుండటం గమనార్హం. ఉప్పును ఇతరులకు ఇచ్చేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
మనం ఏ కూర తిన్నా ఆ కూరలో ఉప్పు ఉంటే మాత్రమే ఆ వంట రుచిగా ఉంటుంది. పూజల సమయంలో కూడా ఉప్పును ఉంచడం మంచిది కాదని చెప్పవచ్చు. ఉప్పుతో దిష్టి తీయడం వల్ల చెడు దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉప్పు ఎవరైతే ఇతరుల నుంచి తీసుకుంటారో వాళ్లపై శని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక సమస్యలు ఉంటే ఉప్పుతో పరిహారాలు చేస్తే మంచిది.
ఎవరైతే జ్యేష్టా దేవిని వదిలించుకోవాలని అనుకుంటారో వాళ్లు సైతం ఉప్పుతో పరిహారాలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఉప్పును ఇతరుల నుంచి తీసుకోవడం వల్ల వాళ్లకు చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఉప్పుకు సంబంధించి ఈ విషయాలను గుర్తుంచుకోవడం ద్వారా నష్టపోయే అవకాశాలు అయితే ఉండవు.