ఉదయం శృంగారంలో పాల్గొనడం మంచిదేనా… నిపుణులు ఏం చెబుతున్నారు?

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం మరింత బలపడాలి అంటే వారి మధ్య లైంగిక జీవితం తప్పనిసరిగా ఉండాలి. అయితే చాలామంది రాత్రి సమయంలో కాకుండా ఉదయం తెల్లవారుజామున శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఉదయం శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని పలువురు భావిస్తుంటారు. మరి తెల్లవారుజామున శృంగారంలో పాల్గొనడం మంచిదా కాదా ఈ విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…

ఉదయం శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట శృంగారంలో పాల్గొనడం వల్ల లిబిడోను యాక్టివేట్ చేస్తుంది. జంటల మధ్య ఎమోషనల్ బాండింగ్ పెంచడానికి సహాయం చేస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో పగలంతా అధిక ఒత్తిడి కారణంగా రాత్రిపూట చాలామంది ఓపిక నశించి నిద్రపోతుంటారు అలాంటి వారికి ఉదయం శృంగారం ఎంతో మంచిది.

ఇలా ఉదయం పూట శృంగారంలో పాల్గొనడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది అలాగే రోజంతా అదే ఉత్సాహంతో ఉంటారు. ఇక ఉదయం పూట శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషులలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి సహజ సిద్ధంగా పెరుగుతుంది తద్వారా స్పెర్మ్ కౌంట్ పెరిగి సంతాన ఉత్పత్తి సమస్యలను తగ్గిస్తుంది.అందుకే ఉదయం పూట శృంగారంలో పాల్గొనడం వల్ల రోజంతా ఎంతో సంతోషంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.