దేశంలోని నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా వరుస జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతుండగా ట్రేడ్స్‌మన్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 67 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.88000 వరకు జీతం లభించనుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మార్చి నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లో ఐటీఐ, ఎన్.ఏ.సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు మినహాయింపుగా ఉండనుందని తెలుస్తోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 88000 రూపాయల వరకు వేతనం లభించనుంది. అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు రుసుము 500 రూపాయలుగా ఉంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించే అవకాశం అయితే ఉంటుంది.
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.