ఇండియన్ ఆయిల్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. గతంలో చాలా జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేసిన ఇండియన్ ఆయిల్ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం గమనార్హం. 473 టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఆయిల్ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది.
అకౌంట్స్/ ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్ ఐ, హ్యూమన్ రిసోర్స్ ఇతర ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుండటంతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతోంది. ఇంటర్ అర్హతతో పాటు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, వైద్య పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను అప్రెంటీస్ గా తీసుకుంటారు. https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి నెల 18వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాతపరీక్షను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను, సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.