పాదాల పగుళ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారా.. చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఇవే!

ఈ మధ్య కాలంలో ఎక్కువ దూరం నడిచే వాళ్లను పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా వేధిస్తోంది. చలికాలంలో ఎక్కువగా ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. . పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువ సమయం పాటు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఎవరైతే థైరాయిడ్ సమస్యతో బాధ పడుతూ ఉంటారో వాళ్లను ఈ సమస్య మరింత ఎక్కువగా వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. పాదాల పగుళ్ల చికిత్స కోసం వెజిటబుల్ ఆయిల్స్‌ ను వినియోగిస్తే మంచిది. ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె సైతం ఈ సమస్యకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి. సబ్బు నీటితో పాదాలను కడిగి ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

పిడికెడు బియ్యం పిండి, కొన్ని చెంచాల తేనె, ఆపిల్ సీడర్ వెనిగర్ లను పేస్టులా తయారు చేసి పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచి ఈ పేస్ట్ ను అప్లై చేస్తే మంచిది. గుప్పెడు వేపాకులు తీసుకొని పేస్టులా చేసుకుని మూడు టీ స్పూన్ల పసుపు జత చేసి బాగా కలిపి పాదాలపై అప్లై చేయడం ద్వారా కూడా పాదాల పగుళ్లకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.

అరటిపండు గుజ్జును పగుళ్లకు రాసుకుని కాళ్లను శుభ్రం చేయడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. బకెట్‌ నీటిలో కొద్దిగా వ్యాజ్‌లైన్, నిమ్మరసం వేసి అరగంట పాటు ఆ నీటిలో పాదాలను ఉంచడం ద్వారా కూడా సమస్యకు చెక్ పెట్టవచ్చు. క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవడం ద్వారా పాదాల పగుళ్ల సమస్య దూరమవుతుంది.