మన శరీరానికి కాల్షియం ఎంత ముఖ్యమో ప్రత్యేకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం శరీరంలో కచ్చితంగా ఉండాలి. శరీరానికి కాల్షియం సరిగా అందకపోతే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కొన్ని లక్షణాల ఆధారంగా కాల్షియం లోపాన్ని గుర్తించడంతో పాటు లోపం వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు.
ఎప్పుడూ అలసటగా ఉండేవారిలో కాల్షియం లోపం ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. గందరగోళం, జ్ఞాపకశక్తిలో మార్పులు సమస్యలకు సైతం కాల్షియం లోపం కారణమవుతుంది. దంతాలు బలహీనంగా మారడం, దంతాల మధ్య గ్యాప్ పెరగడం, చిగుళ్లలో రక్తం కారడం, దంతాల నొప్పులు సైతం కాల్షియం లోపానికి సంకేతాలుగా ఉంటాయి. కండరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా కాల్షియం ఎంతో ముఖ్యం.
కాల్షియం లోపం ఉంటే కండరాల నొప్పులు, కండరాలు దృఢత్వంగా లేకపోవడం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాల్షియం లోపం ఉన్నట్టైతే చేతులు, వేళ్లు, పాదాలు, కాలి భాగంలో నరాలు ప్రభావితం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాల్షియం లోపం చాలా ఎక్కువగా ఉంటే కొన్ని సార్లు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయట. కాల్షియం లోపంతో బాధ పడేవాళ్లు కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే మంచిది.
అయితే వైద్యుల సలహా ప్రకారం మాత్రమే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. కాల్షియం ట్యాబ్లెట్లను ఇష్టానుసారం వాడినా ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.