మనలో చాలామంది నిర్మించుకునే ఇంటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటంతో ఇంటి నిర్మాణం విషయంలో వాస్తు పరంగా తప్పులు జరగకుండా వాస్తు నిపుణులను సంప్రదిస్తూ ఉంటారు. ఇంటి నిర్మాణ సమయంలో బాత్ రూమ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బాత్ రూం విషయంలో వాస్తు నియమాలు పాటించకపోయినా నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.
వాస్తు నిపుణులు చెప్పిన విషయాల ప్రకారం నైరుతి, ఆగ్నేయం దిక్కులలో బాత్ రూమ్ నిర్మించకూడదు. ఈ విధంగా చేస్తే అనారోగ్యం బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. బాత్ రూమ్ లో ట్యాప్ ఉత్తరం దిశగా ఉండేలా చూసుకోవాలి. బాత్ రూమ్ లో తెలుపు లేదా ఇతర లైట్ కలర్స్ తో టైల్స్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. బాత్ రూంలో అద్దం పెట్టుకోవడం కొంతమందికి ఇష్టం కాగా బాత్ రూమ్ లో అద్దం పెట్టుకోవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఈశాన్యం లేదా తూర్పువైపు బాత్ రూమ్ ఉంటే నెగిటివ్ ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది బాత్ రూమ్ ను తక్కువ స్థలంలో నిర్మించాలనే ఆలోచనతో మెట్ల కింద నిర్మిస్తూ ఉంటారు. అయితే మెట్ల కింద బాత్ రూమ్ నిర్మించడం వల్ల చెడు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బాత్రూమ్ అవుట్ లెట్ లు తూర్పు లేదా ఉత్తరం వైపు ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
బాత్రూమ్ ఆగ్నేయ భాగంలో గీజర్, స్విచ్ బోర్డ్, హీటర్ పెట్టుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. బాత్ రూమ్ లో బాత్ టబ్ ను ఏర్పాటు చేసుకునే వాళ్లు తూర్పు లేదా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. బాత్ రూమ్ లో నీలం రంగు మగ్, బకెట్ వాడాలని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు.