ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని యూరిన్ ఇన్ఫెక్షన్స్ వేధిస్తున్నాయి. పిల్లల్లో కూడా చాలామంది పిల్లలు ఈ సమస్య వల్ల బాధ పడుతున్నారు. అయితే తరచూ ఈ సమస్య వేధిస్తుంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కిడ్నీలలో తయారైన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
మూత్రాశయానికి చేరిన మూత్రం మళ్లీ వెనక్కు వెళ్లిపోకుండా మూత్రనాళాలలోని కొన్ని కవాటాలు రక్షించే అవకాశాలు అయితే ఉంటాయి. అలా జరగకపోతే మాత్రం ఆ లక్షణాన్ని ఆరోగ్య సమస్యగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్షణాన్నే యూరిన్ ఇన్ఫెక్షన్ అని అంటారు. అల్ట్రా సౌండ్ స్కాన్, మిక్చ్యురేటింగ్ సిస్టో యరిత్రోగ్రామ్ పరీక్షలు చేయించడం ద్వారా సమస్య ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఈ సమస్యను గుర్తిస్తే వెంటనే పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది. మలబద్ధకం వల్ల కూడా కొన్నిసార్లు ఈ సమస్య తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. మూత్రాశయం, మూత్రనాళం మొదలైన వాటిలో లోపాల వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మూత్రం పోసే సమయంలో పిల్లలు ఏడుస్తున్నారంటే మూత్రనాళాల్లో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
కొన్నిసార్లు పిల్లలకు ఫిమోసిస్ వల్ల కూడా ఈ సమస్య ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. మూత్ర రంధ్రం దగ్గర చర్మం బిగుతుగా తయారు కావడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ సమయంలో పిల్లలను బెదిరించి, బుజ్జగించి ఏడుపు మాన్పించే ప్రయత్నం చేస్తారు. పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య వేధిస్తుంటే కిడ్నీల పనితీరు దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది.