ఫిక్స్డ్ డిపాజిట్ల పై వడ్డీ రేటు పెంపు… ఈ బ్యాంకులలో డిపాజిట్ చేసేవారికి అధిక వడ్డీ..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు సంపాదించిన డబ్బులు కొంత మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్, బ్యాంకులలో వివిధ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువమంది ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లలో తమ డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. బ్యాంకులో నిర్దేశించిన పరిమిత కాలం వరకు ఫిక్స్ డిపాజిట్స్ గేమ్ లో డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక మొత్తంలో వడ్డీ తో లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేటుని పెంచాయి.

ఆర్బీఐ రెపోరేటు, రివర్స్ రెపోరేటు సవరించడంతో వడ్డీ రేటులో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్.బి.ఐ రెపోరేట్ పెంచడంతో అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థలు కూడా కస్టమర్లు చేసే ఎఫ్‌డీ లపై 3 శాతం నుంచి దాదాపు 8.25 శాతం వరకు వడ్డీ రేటును ఇస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అయిన ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ కస్టమర్లకు ఎఫ్‌డీలపై భారీ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇక మరి మనం వాటి వివరాలని కూడా చూసేద్దాం.

ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ల మీద అన్నిటికన్నా ఎక్కువ వడ్డీ ని ఇస్తోంది. సాధారణంగా ఎక్కువ కాల పరిమితి ఉన్న ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీ వస్తోంది. అదే సాధారణ కస్టమర్లకు అయితే 7.75 వడ్డీ ఇస్తోంది. ఇక ఇప్పుడు
ఇండస్‌ఇండ్ బ్యాంకు సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.50 శాతం నుంచి 8.25 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల 3 నెలల వరకు కాల పరిమితి ఉంటుంది. అలాగే యెస్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను 3.25 శాతం-7.5 శాతం ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 8.00 శాతం వరకు ఇస్తోంది. అందువల్ల ఫిక్స్ డిపాజిట్లలో డబ్బు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఈ బ్యాంకులలో ఇన్వెస్ట్ చేయటం వల్ల ఎక్కువ లాభం పొందవచ్చు.