ఇంటర్ అర్హతతో పరీక్ష లేకుండానే నేవీలో ఆఫీసర్ జాబ్.. అత్యంత భారీ వేతనంతో?

ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద బీటెక్ డిగ్రీ కోర్స్ కొరకు ఈ సంస్థ ఖాళీలను ప్రకటించింది. పెళ్లి కాని మహిళా, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్స్ ను పూర్తి చేసిన వాళ్లు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌లలోని అధికారుల పోస్టులలో తిరిగి నియమించబడటం జరుగుతుంది.

joinindiannavy.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ పోస్ట్ ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ కోర్స్ కు ఎంపికైన వాళ్లు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కు సంబంధించిన బీటెక్ కోర్స్ లో క్యాడెట్ లుగా ఎంపిక కావడం జరుగుతుంది. ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్ లలో కోర్స్ పూర్తి చేసిన వాళ్లకు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని ప్రధానం చేయడం జరుగుతుంది.

2024 సంవత్సరం జనవరి 6 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ కాగా 2024 సంవత్సరం జనవరి 20 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఎగ్జిక్యూటివ్ & టెక్నికల్ బ్రాంచ్ లలో మొత్తం 35 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్ 70 శాతం మార్కులు, ఇంగ్లీష్ లో 50 శాతం మార్కులతో ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.

మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించిన అభ్యర్థులకు పోలీస్ వెరిఫికేషన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో మేలు జరగనుంది.