బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు చెప్పింది. 2100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డిసెంబర్ నెల 6వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెంబర్ నెల 30, 31 తేదీలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రెండు గంటలలో ఆన్ లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, గ్రేడ్ ఓ, ఎగ్జిక్యూటివ్ సేల్స్ , ఆపరేషన్స్, ఆన్ లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.
మెడికల్ పరీక్షను సైతం నిర్వహించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. అధికారిక వెబ్ సైట్ సహాయంతో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి మరిన్ని సందేహాలు ఉంటే వెబ్ సైట్ లోని ఫోన్ నంబర్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూసేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరగనుందని చెప్పవచ్చు.