ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ ఎంట్రీ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. హవిల్దార్, నాయబ్ సుబేదార్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న పెళ్లి కాని పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పది, ఇంటర్ అర్హతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. అత్యుత్తమ క్రీడాకారులుగా ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 17.5 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
స్పోర్ట్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. సంస్థ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తును పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నోటిఫికేషన్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.