ఐడీబీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. అత్యంత భారీ వేతనంతో?

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 86 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2023 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. idbibank.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉండనుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డీ ఉద్యోగ ఖాళీలు 1 ఉండగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ ‘సి’ ఉద్యోగ ఖాళీలు 39 ఉన్నాయి. మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 46 ఉండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

విద్యార్హతల ఆధారంగా పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డీ ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ ‘సి’ ఉద్యోగాలకు సైతం 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. మేనేజర్ ఉద్యోగాలకు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 98 వేల రూపాయల నుంచి లక్షా 55 వేల రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక కావాలంటే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.