ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలలో 800 ఉద్యోగ ఖాళీలు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు కాగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1300 సేల్స్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
నవంబర్ 22వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ నెల 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://ibpsonline.ibps.in/idbiesonov23/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కు ఎంపికైన వాళ్లకు ఆరున్నర లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో వేతనం లభించనుంది. ఈ బ్యాంకులకు ఏడాది ప్రొబేషన్ ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కు ఎంపికైన వాళ్లు ఏడాది పని చేయాల్సి ఉండగా పనితీరు ఆధారంగా పొడిగించడం జరుగుతుంది. దరఖాస్తు రుసుము 1000 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రం 200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఆన్ లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి.