ఇండియన్ ఆయిల్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొత్తం 513 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి నెల 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. జూనియర్‌ ఇంజనీర్‌ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ ఇంజనీరింగ్‌, ఎమ్మెస్సీ విభాగాలతో పాటు కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మ్యాథమాటిక్స్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సూ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. https://www.iocl.com/ వెబ్ సైట్ లో కెరీర్స్ ఆప్షన్ ను ఎంచుకుని ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అత్యంత భారీ వేతనం లభించనుంది.

ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.