ఇంటర్ అర్హతతో ఐఓసీఎల్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సు భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. iocl.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

కనీసం 40 శాతం మార్కులతో ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 17 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైద్య పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.

అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు సులువుగా వేతనం లభించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. పెద్దగా నియమ నిబంధనలు లేకపోవడంతో ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగానే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.

దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకొని సంబంధిత పత్రాలతో పాటు గడువు తేదీలోగా పంపడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. ఐఓసీఎల్ జాబ్స్ పై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా సులువుగా మంచి వేతనం పొందవచ్చు.