పరీక్ష లేకుండానే నేవీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.56 వేల వేతనంతో?

ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఇప్పటికే ఎన్నో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కాగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా అక్టోబర్ 29వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

joinindiannavy.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఎయిర్ ఆపరేషన్, పైలట్, ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ద్వరా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.56 వేల వేతనం లభించనుంది.

డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను చేపడతారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు పలు రకాల అలవెన్సులు కూడా ఇవ్వనున్నారని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే ఛాన్స్ ఉండగా అర్హత ఉన్నవాళ్లు ఒకటి కంటే ఎక్కువ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.