ఇండియన్ నేవీలో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. రాతపరీక్ష లేకుండా 224 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రికల్ బ్రాంచి(జనరల్ సర్వీస్) ఉద్యోగ ఖాళీలు 50 ఉండగా జనరల్ సర్వీస్/ హైడ్రో కేడర్ ఉద్యోగ ఖాళీలు 40 ఉన్నాయి. ఇంజినీరింగ్ బ్రాంచి(జనరల్ సర్వీస్) ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. నావల్ కన్‌స్ట్రక్టర్ ఉద్యోగ ఖాళీలు 20 ఉండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 18 ఉన్నాయి. పైలట్ ఉద్యోగ ఖాళీలు 20 ఉండగా లాజిస్టిక్స్ ఉద్యోగ ఖాళీలు 20, ఎడ్యుకేషన్ ఉద్యోగ ఖాళీలు 18 ఉన్నాయి.
పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ తో పాటు బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా మెరిట్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. నేవీ నుంచి వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
ఈ నెలాఖరు వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నేవీ సంస్థలో ఎక్కువ మొత్తం వేతనం లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది.