ఇండియన్ నేవీలో 910 ఉద్యోగ ఖాళీలు.. నెలకు ఏకంగా రూ.లక్ష వేతనంతో?

ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 910 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 610 ట్రేడ్స్‌మన్ మేట్ ఉద్యోగ ఖాళీలతో పాటు 42 ఛార్జిమాన్, 258 సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. డిసెంబర్ 18వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

joinindiannavy.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్‌లో బీఎస్సీ డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌తో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వాళ్లు సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐటీఐ సర్టిఫికెట్‌, 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉన్నవాళ్లు ట్రేడ్స్‌మన్ మేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. చార్జ్‌మెన్,ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టులకు 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుకు అర్హత కలిగి ఉంటారు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 295 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ, ఎక్స్ సర్వీస్ మేన్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు రాతపరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. 100 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. గంటన్నర పాటు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు ఏకంగా లక్ష రూపాయల వేతనం లభించనుంది.