ఇండియన్ కోస్ట్ గార్డ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింద్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఈ శాఖ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైందని సమాచారం అందుతోంది. సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగ ఖాళీలతో పాటు మోటర్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్ (మెకానికల్), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్ క్లీనర్) ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.
https://indiancoastguard.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీ ఒకటి మాత్రమే ఉండగా ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్ (మెకానికల్) ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్ క్లీనర్) ఉద్యోగాలను అన్‌రిజర్వ్‌డ్, ఎస్సీ వర్గానికి చెందిన వాళ్లు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (మాలి) ఉద్యోగానికి ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థి అర్హత కలిగి ఉంటారు.
రిజర్వేషన్ల ఆధారంగా మిగిలిన ఉద్యోగ ఖాళీల భర్తీ కూడా జరగనుందని సమాచారం అందుతోంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్) ఉద్యోగ ఖాళీలు ఆర్థికంగా వెనుకబడిన విభాగానికి చెందిన అభ్యర్థితో పాటు ఎస్సీ అభ్యర్థికి రిజర్వ్ అయ్యి ఉంది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. సంస్థ నోయిడా అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.