పది, ఇంటర్ అర్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.30,000 వేతనంతో?

భారత రక్షణ రంగంలో జాబ్ చేయాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ కోస్ట్‌‌ గార్డ్ వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. joinindiancoastguard.cdac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

దరఖాస్తు చేసుకోవడానికి మరో వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కోస్ట్ గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగ ఖాళీలు 260 ఉండగా నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగ ఖాళీలు 30 ఉండగా యాంత్రిక్(మెకానికల్) ఉద్యోగ ఖాళీలు 25 ఉన్నాయి.

యాంత్రిక్(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 20 ఉండగా యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్) ఉద్యోగ ఖాళీలు 15 ఉన్నాయి. మొత్తం 150 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు అర్హతలు ఉండగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే వాళ్లకు గరిష్టంగా రూ.29,200 వరకు వేతనం లభిస్తుంది. www.joinindiancoastguard.cdac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.