మన దేశంలో లక్షల మంది బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇలా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇండియన్ బ్యాంక్ అప్రెంటీస్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. జులై 10వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 31వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
indianbank.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 జులై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. indianbank.in వెబ్ సైట్ లో కెరీర్ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ బ్యాంక్ అప్రెంటీస్ 2024 – 25 లింక్ ద్వారా నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఆన్‌లైన్ ఎగ్జామ్, లోకల్ లాంగ్వేజ్‌పై స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ను నిర్వహించి దశల వారీగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.