ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.7 లక్షల వేతనంతో?

నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అదిరిపోయే తీపికబురు అందించింది. ఇంటర్ అర్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు భారీ జాబ్ నోటిఫికేషన్ వెలువడగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 1,70,000 రూపాయల వేతనం లభించనుంది. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

మొత్తం 317 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం. జూన్ 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. afcat.cdac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగంలో మొత్తం 5 బ్రాంచుల్లో ఉండగా ఉద్యోగ ఖాళీలను విద్యార్హతల ఆధారంగా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్ రిక్రూట్‌మెంట్‌ కోసం 24 సంవత్సరాల లోపు ఉద్యోగులు అర్హులు కాగా గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ పోస్టులకు 26 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారు.