ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్-సి సివిలియన్ పోస్టుల భర్తీకి ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 182 సివిలియన్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రక్రియను మొదలుపెట్టడం గమనార్హం. indianairforce.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సెప్టెంబర్ నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 182 ఉద్యోగ ఖాళీలలో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీలు ఉండగా టైపిస్ట్ ఉద్యోగాలు 18 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు డ్రైవర్ ఉద్యోగ ఖాళీలను సైతం భర్తీ చేస్తుండగా ఈ ఉద్యోగ ఖాళీలు 7 ఉన్నాయని సమాచారం అందుతోంది. 18 నుంచి 25 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
కనీసం ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషానికి కనీసం 30 పదాలను టైపింగ్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు టైపిస్ట్ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. అయితే హిందీ టైపింగ్ వచ్చిన వాళ్లు మాత్రమే టైపింగ్ ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో డ్రైవింగ్ లో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు డ్రైవర్ ఉద్యోగాలకు అర్హులు.
డ్రైవర్ పోస్టుకు కనీస అర్హత పదో తరగతి అని సమాచారం అందుతోంది. మొదట రాత పరీక్షను నిర్వహించి స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ లేదా ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడతారు. indianairforce.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్ల వేతనాల వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.