ఇండియా పోస్ట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. రాతపరీక్ష లేకుండానే ఈ సంస్థ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటం గమనార్హం. పోస్టల్
అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్ కోటా కింద ఇండియా పోస్ట్ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు సమాచారం అందుతోంది.
అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండటంతో పాటు కంప్యూటర్‌పై పనిచేసే పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేవారు 12వ తరగతి పాసైన వాళ్లు అర్హత కలిగి ఉంటారు. లైసెన్స్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలకు పదో తరగతి పాసైన వాళ్లు అర్హత కలిగి ఉంటారు. క్రీడలలో ప్రతిభ చూపిన వాళ్లు స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.