పోస్టాఫీసులో 44,228 పోస్టులు.. పదో తరగతి మార్కులతో ఎలా ఎంపిక చేస్తారంటే?

పోస్టాఫీస్ లో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 44,228 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(ఏబీపీఎం) లేదా డాక్‌ సేవక్‌ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

ఈసారి ఏకంగా 44,228 పోస్టుల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయసులో సడలింపులు ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్సీ,ఎస్టీ,పీడబ్లూడీ,ట్రాన్స్ఉమెన్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకపోవడం గమనార్హం. మిగతా వాళ్లు మాత్రం 100 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

www.indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిష్టర్ చేసుకుని ఫీజు పేమెంట్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సొంత మెయిల్‌ ఐడీ, మొబైల్ నంబర్‌ సహాయంతో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ జనరేట్‌ అయిన తర్వాత లాగిన్‌ అయి ఫీజు పేమెంట్‌ చేయాలి.

పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా రిజల్ట్స్, ఫిజికల్ వెరిఫికేషన్ డేట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయల నుంచి 28,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.