నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రూ.1,40,000 భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

దేశంలో చాలామంది నిరుద్యోగులు టీచింగ్ వృత్తిలో స్థిరపడాలని భావిస్తున్నారు. ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలతో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. iitism.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. మొత్తం 71 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2023 సంవత్సరం అక్టోబర్ నెల 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది.

ఓబీసీ నాన్ క్రీమిలేయర్ కేటగిరీ ఉద్యోగ ఖాళీలు 35 ఉండగా ఎస్సీ కేటగిరీ కింద 25 ఉద్యోగ ఖాళీలు, ఎస్టీ కేటగిరీ కింద 11 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఫస్ట్ క్లాస్‌లో పీహెచ్‌డీ చేసిన అభర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 1,39,600 నుండి రూ. 2,04,700 మధ్య వేతనం లభించే అవకాశం ఉంది. ఐఐటీ ధన్ బాద్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.