రాతపరీక్ష లేకుండానే ఐడీబీఐ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను ఈ సంస్థ రిలీజ్ చేయగా మొత్తం 6 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. idbibank.in వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది.

గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా కాలేజీ నుండి అల్లోపతి వైద్య విధానంలో డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.

షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. సంస్థ ముంబై అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. ఐడీబీఐ బ్యాంక్ లో జాబ్ చేయాలనే ఆకాంక్ష ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై ఫోకస్ పెడితే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.

ఐడీబీఐ బ్యాంక్ లో ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఎక్కువ మొత్తం వేతనం లభించనుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ సైతం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది.