గత కొన్ని నెలలలో గ్యాస్ సిలిండర్ ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. పెరిగిన ధరలతో గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేయాలంటే సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఒకింత భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే శుభవార్త వెలువడింది. కాంపొసైట్ గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు.
కొత్త రకం గ్యాస్ సిలిండర్ల రూపంలో ఈ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తున్నాయి. పారదర్శకంగా బరువు తక్కువగా ఉండే ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల ఎంతో లాభమే తప్ప నష్టం ఉండదని చెప్పవచ్చు. ఈ గ్యాస్ సిలిండర్ల ద్వారా గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో కుడా ముందుగానే సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ల ధర 300 రూపాయలుగా ఉంది.
రెగ్యులర్ గ్యాస్ సిలిండర్లు 14 కేజీల బరువు ఉండగా ఈ సిలిండర్లు 10 కేజీల బరువుతో ఉంటాయి. చిన్న కుటుంబాలకు ఈ గ్యాస్ సిలిండర్ ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకునే వాళ్లు ఈ గ్యాస్ సిలిండర్ ను తీసుకోవడం ద్వారా బెనిఫిట్ ను పొందవచ్చు. పాత సిలిండర్ ను వాడేవాళ్లు ఆ కనెక్షన్ ను వెనక్కు ఇచ్చి కొత్త కనెక్షన్ ను తీసుకోవచ్చు.
లైట్ వెయిట్ తో ఉండే ఈ సిలిండర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని గ్యాస్ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా ఈ గ్యాస్ కనెక్షన్ ను పొందవచ్చు. గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసేవాళ్లు ఈ విధంగా చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.