భార్య భర్తల మధ్య ప్రేమ చిగురించి వారి బంధం బాగుండాలంటే ఇలా చేయాల్సిందే!

ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకునే సందర్భాలు, కలిసి భోజనం చేసే సందర్భాలు చాలా అరుదు గానే ఉంటాయని చెప్పొచ్చు.జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే భార్యాభర్తల మధ్య అనుబంధం, ప్రేమానురాగాలు దెబ్బతిని చివరకు విడిపోయే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. సంసార జీవితం సాఫీగా సాగిపోవడానికి డబ్బు ఒక్కటే సరిపోతుంది ఇద్దరి మధ్య అన్యోన్యత, ఆత్మీయత, చిలిపి గొడవలు, శారీరక తృప్తి ఇవన్నీ ఉంటేనే భార్యాభర్తల మధ్య బంధం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది.

ఈ రోజుల్లో వృత్తిపరమైన బాధ్యతల కారణంగా భార్యాభర్తలు ఇద్దరు ఏకాంత సమయం ఎక్కువ గడపలేకపోతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగి సంసార జీవితం దెబ్బతింటుంది. ఈ సమస్య నుంచి దంపతులిద్దరూ బయటపడడానికి చక్కటి పరిష్కారం పిల్లో టాక్. ఈ విధానంలోఐ కాంటాక్ట్ ఉండదు. పిల్లో టాక్ లో ఆలోచించి పదబంధాలు అల్లడం ఉండదు. ఆచితూచి మాట్లాడటం అస్సలే ఉండదు. అంటే ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి పదాలు వాడుతున్నాం అనే సెన్సార్ షిప్ పిల్లో టాక్ లో ఉండదు. భార్య భర్తలు ఇద్దరు ఏకాంతంగా ఎలాంటి పదాలనైనా వాడుకోవచ్చు ఎలాగైనా ఉండొచ్చు దీనివల్ల ఇద్దరి మధ్య దూరం తగ్గి బంధం బలపడుతుంది.

దంపతులిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఎక్కువ కాలం నిలవాలంటే పడకగదిలో ఆర్థిక విషయాలు, అనవసరపు విషయాలకు బదులు వారి గురించి, వారి బంధం గురించి మాట్లాడుకోవడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. పాత జ్ఞాపకాలు, పెళ్లి జరిగిన కొత్తలో అనుభవించిన మధురానుభూతులు, ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు, సరదా సంఘటనలు ఇలాంటివి మాట్లాడుకోవడం వల్ల వారి మధ్య ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయి. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడపడానికి మీకు ఇష్టమైన బయట ప్రదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోండి.