ఉదయం లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే ఈ సమస్యలు తప్పవు!

ఈ ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ మన శరీరంలో భాగంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే రోజు గడవడం కష్ట సాధ్యమవుతుంది.ఈరోజుల్లో మనీ ట్రాన్సాక్షన్ మొదలుకొని టార్చ్ లైట్ వినియోగించడం వరకు అన్ని పనులకు స్మార్ట్ ఫోన్ పైనే ఆధారపడి ఉన్నాము
అయితే స్మార్ట్ ఫోన్ వాడకంలో ఎంత మంచి దాగి ఉందో చెడు ప్రభావం కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగించేవారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ అరచేతిలో ఉంటే ఒక్క క్షణంలో ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. అలాగని రాత్రింబవళ్లు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తారు తీవ్ర మానసిక సమస్యలతో పాటు కంటి జబ్బులు, చర్మ సమస్యలు, లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా కొందరిలో ఉదయం నిద్ర లేవగానే స్మార్ట్ ఫోన్ వినియోగించే అలవాటు ఉంటుంది. అలాంటి వారిలో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే ప్రమాదకర నీలి కాంతి కిరణాలు మరియు రేడియేషన్ సున్నితమైన రెటీనా పనితీరుపై ప్రభావం చూపి కంటి చూపు మందగించడంతోపాటు కళ్ళు ఎర్రబడడం, కంటి కింద చారలు, కంటి వాపు వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే కంటి సమస్యలతో పాటు మెదడు పనితీరు మందగించి ఏకాగ్రత లోపించి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారిలో కూడా నిద్రలేమి సమస్యతో పాటు అనేక కంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి సమస్య వల్ల ఒత్తిడి పెరిగి ఉబకాయం , రక్తపోటు, అల్జీమర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నపిల్లల్లో అయితే మెదడు కణాలు దెబ్బతిని మానసిక సామర్థ్యం తగ్గుతుంది ఫలితంగా జ్ఞాపకశక్తి కోల్పోయి మానసిక అంగవైకల్యంతో బాధపడాల్సి వస్తుంది.